దిశా మహిళా పోలీస్స్టేషన్ డిఎస్పి గా బాధ్యతలు చేపట్టిన శ్రీ గోపు రాజీవ్ కుమార్ గారు 

                   మచిలీపట్నం దిశ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పిగా శ్రీ గోపు రాజీవ్ కుమార్ గారు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు, అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్., గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు

       రాజీవ్ కుమార్ గారు 1991 బ్యాచ్క చెందిన ఎస్ఐగా పోలీసు శాఖ లో ప్రవేశించి, ముందుగా కృష్ణాజిల్లాలోని కూచిపూడి, హనుమాన్ జంక్షన్ తిరువూరు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించి, C I గా గుడివాడ పట్టణ, గుడివాడ రూరల్ సర్కిల్ లో సి ఐ గా విధులు నిర్వహించారు, 2014 సంవత్సరంలో డిఎస్పీగా పదోన్నతి పొంది గన్నవరం విమానాశ్రయం, విజయవాడ టాస్క్ఫోర్స్ ACP గా, అనంతరం కర్నూలు జిల్లా టాస్క్ఫోర్స్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ ఈ మధ్యకాలంలో రాష్ట్ర డిజిపి గారు నిర్వహించిన బదిలీల్లో భాగంగా మచిలీపట్నం దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీగా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ మహిళల ఫిర్యాదులపై తక్షణం స్పందించి వారికి న్యాయం చేయాలని, ఎటువంటి జాప్యం వహించరాదని, మహిళల భద్రతకై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిందని, అంతే కాకుండా వారు ఆపదలో ఉన్న సమయంలో ఆదుకునేందుకు దిశ యాప్ కూడా రూపొందించారని, కనుక మహిళల సమస్యలు పరిష్కరించడంలో నూ, దిశ యాప్ ను మహిళలకు చేరువ చేయడంలో, యాప్ ను ఎక్కువ సంఖ్య లో వినియోగించుకునేందుకు కృషి చేయాలని తెలిపారు

          డీఎస్పీ రాజీవ్ కుమార్ గారు మాట్లాడుతూ దిశ పోలీస్ స్టేషన్ DSP గా రావడం సంతోషంగా ఉందని,గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళల భద్రతకు పెద్దపీట వేశారని, మహిళలకు సత్వర న్యాయం చేకూరేలా, వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసారని, అంతేకాక మహిళలు ఆపదలో ఉన్న సమయంలో తక్షణం పోలీసు వారి సహాయం పొందేందుకు " దిశ " యాప్ ను రూపొందించారని, ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో, ప్రతి ఒక్క మహిళ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా మరియు దిశ యాప్ ఏ విధంగా ఉపయోగించి ఆపద నుంచి బయటపడొచ్చు మహిళలకు పెద్ద సంఖ్యలో అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యవంతులను చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు మహిళా సమస్యలు పరిష్కరించడంలోనూ, విద్యార్ధినులు, మహిళలు, యువతులు, మహిళలు ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు కృషి చేస్తానని, ఇక్కడ జిల్లాలో పని చేసిన అనుభవం కూడా ఉందని DSP గారు తెలిపారు రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్., గారు, జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్., గారి., సూచనల మేరకు విధులు నిర్వహిస్తూ, మహిళా సమస్యలు పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు

కర్ఫ్యూ ఆంక్షలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు- జిల్లా ఎస్పీ.

      జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు పెడన పట్టణంలో స్వయంగా కర్ఫ్యూ ఆంక్షలను పర్యవేక్షించినారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ. కొన్ని కొన్ని ప్రాంతాలలో, గ్రామాలలో కేసులు పేరుగుతునందున ఈ కర్ఫ్యూ నిబంధనలు పక్కగా అమలు జరుపుతున్నాం, కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలు సహకరించాలనీ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి, ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి మాట్లాడాలని సూచించారు.

కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలు తమ వంతు బాధ్యతను గుర్తించి పోలీస్ శాఖకు సహకరించాలని, ప్రజలు ఎంతో అత్యవసరం అయితే కానీ రోడ్ల మీదకు రావద్దు అని విజ్ఞప్తి చేసారు. బయటకు రావలసిన సందర్బములో తమకు ఉన్న పనులను ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు పూర్తి చేసుకోవాలని, ఆ తరువాత కేవలం మెడికల్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితులు ఉన్నవాళ్ళు మాత్రమే బయటకు రావాలి అని విజ్ఞప్తి చేసారు. అనవసరంగా బయటకు వచ్చి పోలీస్ వారికీ ఇబ్బంది కలగించవద్దు. కొంతమంది ఆకతాయిలు అనవసరంగా రోడ్డ్లపైకి వచ్చి తిరుగుతున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకొనుబడతాయని హెచ్చరించనారు. ఈ కర్ఫ్యూ ముఖ్యంగా ప్రజలందరి రక్షణ కొరకు, ప్రజలను కోవిడ్ మహమ్మారి నుండి కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేయడమైనది కావున కోవిడ్ ఆంక్షలను ప్రజలు తప్పకుండా పాటించి పోలీసు వారికి సహకరించాలని సూచించారు.

అలాగే కోవిడ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేయాలని, అవసరమైతే స్థానికంగా ఉన్న ప్రముఖులు, రెవెన్యూ అధికారులతో, చాంబర్ ఆఫ్ కామర్స్ వారితో మాట్లాడి అవసర సూచనల మేరకు, కరోనా కేసులు కట్టడం నేపథ్యంలో పూర్తి లాక్ డౌన్ ప్రకటించవచ్చు. అంతేకాకుండా సమయం కాని సమయంలో ఆటకాయితనంగా బయటకు వచ్చే వాహనదారులను నిలువరించి, వారి వాహనాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేయాలని, అవసరం మేరకు కఠిన చర్యలకు ఉపక్రమించాలని అధికారులకు సూచించారు.

ఎస్పీ గారి వెంట స్పెషల్ ట్రైన్స్ డిఎస్పి ధర్మేంద్ర గారు, బందరు డీఎస్పీ మాసూం భాషా గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమణగారు, రూరల్ సీఐ కొండయ్య గారు, పెడన ఎస్సై మురళి గారు, సిబ్బంది పాల్గొన్నారు

మహిళల భద్రత - మనందరి బాధ్యత

         రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్ లు , సబ్ ఇనస్పెక్టర్ లు మరియు దిశ పోలీస్ స్టేషన్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ శ్రీ గౌతమ్ సవాంగ్ IPS గారు మహిళా భద్రత కోసం చేపట్టవలసిన కార్యచరణ, వారి రక్షణ కోసం రూపొందించిన దిశ యాప్ పై అవగాహన కార్యక్రమాలు మొదలైన అంశాల గురించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు

 జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపిఎస్ గారు, అడిషనల్ ఎస్పీ శ్రీమతి మలిక garg ips గారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు, ఏఆర్ సత్యనారాయణ గారు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు

         రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమంలో భాగంమైన మహిళల భద్రత లో భాగంగా తీసుకోవాల్సిన చర్యలు, దిశ యాప్ పై మహిళల్లో అవగాహన... ప్రతీ మహిళ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయాల్లో సేవలు వినియోగించుకునేలా చైతన్యం చేయడం, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన, మొదలగు అంశాలపై డిజిపి గారు దిశానిర్ధేశం చేశారు. అంతేకాకుండా పోలీస్ అధికారులు సిబ్బంది తో పాటు, మహిళా పోలీసులను, వాలంటీర్లను, మహిళా మిత్ర కార్యదర్శులను, అందరిని ఇందులో భాగస్వాములను చేస్తూ దిశ యాప్ లో ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్ నందు డౌన్ లోడ్ చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలని తెలిపారు.

          ఎస్పీ గారు మాట్లాడుతూ మహిళల భద్రత మనందరి బాధ్యత అని, దానికి ప్రతి ఒక్క పాఠశాలలు, కళాశాలలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, దిశ యాప్ యొక్క ఉపయోగం, పనితీరు మొదలైన అంశాల గురించి పూర్తి అవగాహన కల్పిస్తామని, వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశా మహిళా పోలీస్ స్టేషన్ లో సమస్యతో వచ్చినవారికి తక్షణ పరిష్కారం అందించేలా కృషి చేస్తామని, వారి భద్రతకు మరింత భరోసా కల్పించేలా కార్యాచరణ, ప్రణాళికలు రూపొందిస్తామని తెలియజేశారు. ఇప్పటికే జిల్లాలో దిశ యాప్ వల్ల రక్షణ పొందిన మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు పోలీసుశాఖకు తెలియజేశారని, దిశ యాప్ గురించి తెలియని మారుమూల ప్రాంతాల్లో సైతం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచి డిఎస్పి ధర్మేంద్ర గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమణగారు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు